కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్న నితిన్

Published on Jun 11, 2019 9:14 pm IST

గత మూడు సినిమాలు ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో హీరో నితిన్ కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో వెంకీ కుడుములు, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాలకు సైన్ చేశారు. వారిలో వెంకీ కుడుములు చిత్రం మొదటి షెడ్యూల్ రేపు 12వ తేదీన నుండి మొదలుకానుంది.

ఈ చిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది కూడా వెంకీ కుడుముల గత చిత్రం ‘ఛలో’ తరహాలోనే రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. నితిన్ ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. ఇందులో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్ రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

More