నితిన్ హిట్ కొట్టి తీరాల్సిందే

Published on Feb 18, 2020 9:39 pm IST

‘అ..ఆ’ తర్వాత హీరో నితిన్ కెరీర్లో ఆ స్థాయి హిట్ మళ్లీ పడలేదు. ఆయన గత చిత్రాలు ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ మూడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు చేసిన కొత్త చిత్రం ‘భీష్మ’ పైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. సినిమాకు ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ బజ్ ఉండటంతో గత పరాజయాలతో పని లేకుండా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.19 కోట్లకు పైగానే ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్, ఒ
ఇతర ప్రాంతాలతో కలిపి ఆ మొత్తం రూ.26 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. ఈ మొత్తం వెనక్కి రాబట్టి మంచి లాభాలు రావాలంటే సినిమా తప్పకుండా విజయం సాధించి తీరాలి. పాటలు, ట్రైలర్ చూస్తే దర్శకుడు వెంకీ కుడుముల చిత్రాన్ని ఆకట్టుకునే రీతిలోనే తెరకెక్కించారనే నమ్మకం కలుగుతోంది. ఈ నెల 21న విడుదలకానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయకిగా నటించారు.

సంబంధిత సమాచారం :