భారీ లాభా దిశగా నితిన్ ‘భీష్మ’..!

Published on Feb 24, 2020 2:32 pm IST

హిట్ టాక్ తో దూసుకుపోతున్న భీష్మ వరల్డ్ వైడ్ గా భారీ లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. వీకెండ్ ముగిసే నాటికే ఈ చిత్రం చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యింది. కృష్ణ డిస్ట్రిక్ట్ లో భీష్మ 1.30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపగా మూడు రోజులకు అక్కడ 1.08కోట్ల షేర్ ఈ చిత్రం రాబట్టింది. అంటే నేడు లేదా రేపు ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కి చేరుకునేలా కనిపిస్తుంది. మంగళవారం సాయంత్రం నుండి లేదా బుధవారం నుండి లాభాలు మొదలవుతాయి.

ఇక ఓవర్సీస్ లో కూడా భీష్మ మంచి ఆదరణ దక్కించుకుంటుంది. యూఎస్ లో భీష్మ తాజా సమాచారం ప్రకారం $6 లక్షల వసూళ్లకు చేరుకుంది. త్వరలోనే మిలియన్ వసూళ్లకు చేరుకుంటుంది. నితిన్ కెరీర్ బెస్ట్ భీష్మ తో నమోదు చేసుకోవడం ఖాయం అనిపిస్తుంది. దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More