డైరెక్ట్ ఓటిటి గా నితిన్ మాస్ట్రో…త్వరలో అధికారిక ప్రకటన!?

Published on Jul 26, 2021 12:00 am IST


నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో చిత్రం విడుదల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటిగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా నివేదికల ప్రకారం ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చిత్ర నిర్మాతల తో ఒక అగ్రిమెంట్ కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రసారం కానున్నట్లు సమాచారం.

అయితే అగ్రిమెంట్ ప్రకారం మాస్ట్రో చిత్రం ఆగస్ట్ 15 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర నిర్మాత ల నుండి త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో నితిన్ సరసన తమన్నా భాటియా, నబ్బా నటేష్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :