ఆఖరి ఘట్టంలో ‘శ్రీనివాస కళ్యాణం’ !

ఆఖరి ఘట్టంలో ‘శ్రీనివాస కళ్యాణం’ !

Published on Jun 4, 2018 1:40 PM IST

నితిన్, రాశీ ఖన్నాలను హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర కియేషన్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘శతమానం భవతి’ లాంటి హిట్ సినిమా తీసిన రచయిత, దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రంతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చెయ్యబోతున్నాడు.

హైదరాబాద్, ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి షెడ్యూల్ కి చేరుకుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళబోతు౦ది. మిక్కీ.జె.మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ‘లై, చల్ మోహన్ రంగ’ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో నితిన్ కెరీర్ కు ఈ సినిమా కీలకంగా మారనుంది.

తాజా వార్తలు