నితిన్ కెరీర్ కే అరుదైన సినిమా అట !

Published on Mar 27, 2020 1:00 am IST

నితిన్ ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని ఎట్టకేలకూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ హిట్ ఇచ్చిన రెట్టించిన ఉత్సాహంతో త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్న సంగతి తెలిసింది. అలాగే తన తర్వాతి సినిమాగా ‘రంగ్ దే’ చేస్తున్నారు. అలాగే దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న ‘పవర్‌ పేట’ అనే సినిమా కూడా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. పైగా ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, అలాగే 40 ఏళ్ల వ్యక్తిగా, 60 ఏళ్ల ముసలాడిగా కూడా కనిపించబోతున్నాడు.

మొత్తానికి ఈ సినిమా నితిన్ కెరీర్ కే అరుదైన సినిమాగా నిలుస్తోందట. కృష్ణ చైతన్య రాసుకున్న స్క్రిప్ట్ పెద్ద స్పాన్‌ ఉన్న కథ అని.. మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ కథ 1960 – 2020 వరకూ నడుస్తోందట. నవంబర్ నుండి ‘పవర్‌ పేట’ షూటింగ్‌ ను మొదలుకానుంది. నితిన్ కెరీర్‌లో ఈ సినిమా మోస్ట్‌ యాంబీషియస్‌ సినిమా అవ్వనుంది. .

సంబంధిత సమాచారం :

More