మొదలైన నితిన్ – కరుణాకరన్ మూవీ సెకండ్ షెడ్యూల్

karunakar-nithin
వరుస హిట్స్ అందుకొని హ్యాపీగా ఉన్న యంగ్ హీరో నితిన్ హీరోగా, సూపర్బ్ లవ్ ఎంటర్టైనర్స్ చేసిన కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. జూన్ లో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ఆగష్టు మొదటి వారం వరకూ కంటిన్యూగా జరగనుంది.

ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే కరుణాకరన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version