నితిన్ ‘లై’ చిత్ర ఫస్ట్ సాంగ్ విడుదలయ్యేది ఎప్పుడంటే..!


యంగ్ హీరో నితిన్ తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీ లతో విజయాలను నితిన్ సొంతం చేసుకుంటున్నాడు. ఈ సారి కూడా లవ్ స్టోరీ తో రాబోతున్నా దానికి యాక్షన్ ని జత చేయనున్నాడు. నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘లై’.

సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బలమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.నేడు చికాగోలో నిర్వహించే ఓ ఈవెంట్ ద్వారా ‘లై’ చిత్రంలోని మొదటి పాటని విడుదల చేయనున్నట్లు చిత్ర టీం ప్రకటించింది. రేపు(సోమవారం) ఉదయం 9 : 30 గంటలకు ‘బొంబాత్’ అనే పాట ఆన్లైన్ లో అందుబాటులోకి రానుంది.కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది.