నితిన్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు !
Published on Mar 3, 2018 5:58 pm IST

నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో చల్ మోహన్ రంగ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నేష్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రాశిఖాన్న , నందిత శ్వేతా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే నటీ నటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook