రమేష్ వర్మ కు షాక్ ఇచ్చిన నితిన్ !

Published on Mar 22, 2019 12:46 pm IST

యంగ్ హీరో నితిన్ ఇటీవల తన ఫ్యాన్స్ కు నేను చేయబోయే సినిమాల గురించి ఈ నెలలో అప్డేట్స్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. అన్నట్లుగానే నిన్న ఆయన తన కొత్త చిత్రం గురించి తెలియజేశాడు. సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో సినిమా చేయనున్నాని ట్వీట్ చేశాడు నితిన్. అయితే అదే రోజు రైడ్ ఫేమ్ రమేష్ వర్మ తో కూడా ఓ సినిమా చేయనున్నాడని ఆగస్టు లో ఈ చిత్రం లాంచ్ కానుందని ప్రకటన వచ్చింది. అయితే దీనిపై నితిన్ స్పందించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.

ఈ న్యూస్ కాస్త వైరల్ అయ్యేసరికి నితిన్ తాజాగా మళ్ళి ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. నేను చేయబోయే సినిమాల గురించి నా సోషల్ మీడియా ద్వారా నేను అప్డేట్స్ ఇస్తానని ఫేక్ న్యూస్ నమ్మకండి అని ఆయన తాజాగా ట్వీట్ చేశాడు.

సో నితిన్ ఇంకా ఓకే చెప్పకముందే రమేష్ వర్మ అత్యుత్సహం తో నితిన్ తో సినిమా చేయనున్నాని ప్రకటించుకున్నాడు. దాంతో ఆయన ఫై నితిన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :