త్వరలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్న స్టార్ హీరో !
Published on Nov 15, 2016 10:47 pm IST

nithin

ప్రస్తుతం సినీ హీరోలు చాలా మంది ఒక్క సినిమాలను మాత్రమే నమ్ముకోకుండా ఇతర బిజినెస్లలోకి కూడా అడుగుపెడుతున్నారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని రెట్టింపు చేసుకుని, భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం కొత్త తరహా ఆలోచనలతో వ్యాపార రంగంలో ముందుకు దూసుకెళుతున్నారు. ప్రస్తుతం తెలుగు యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన నితిన్ అదే విధానాన్ని ఫాలో అవుతున్నాడు. త్వరలో ఆయన ఫుడ్ బిజినెస్ లోకి దిగనున్నాడు.

సైన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ టి – గ్రిల్- టేస్ట్ అఫ్ తెలుగు పేరుతో ఓ మల్టీ క్యుసైన్ రెస్టారెంట్ ని మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే ఈ రెస్టారెంట్ తాలూకు పనులు కూడా దాదాపు పూర్తైఅంట్టు తెలుస్తోంది. ఈ వ్యాపారంలో నితిన్ కు భాగస్వామిగా ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన కోన నీరజ పని చేయనున్నారు. మనం కూడా నితిన్ అండ్ టీం ఈ బిజినెస్ లో సక్సెస్ వ్వాలని విష్ చేద్దాం.

 
Like us on Facebook