తెలుగు రాష్ట్రాలలో ఆగని భీష్మ వసూళ్ల జోరు..!

Published on Feb 25, 2020 9:58 am IST

నితిన్ భీష్మ మూవీ వసూళ్ల జోరు కొనసాగుతుంది. వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుంది. నైజాంలో సోమవారం ఈ మూవీ 71 లక్షల షేర్ రాబట్టి ఆశ్యర్యపరిచింది. దీనితో మొత్తంగా నైజాంలో ఏకంగా 6.64 కోట్ల షేర్ వసూలు చేసింది . ఇక ఉత్తరాంధ్రలో నాలుగు రోజులకు 2.13 కోట్ల షేర్ వసూలు చేసింది.సోమవారం ఉత్తరాంధ్రలో భీష్మ 34 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక నాలుగు రోజులకు గుంటూరు 1.51 కోట్లు, కృష్ణ 1.05 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక చాలా ఏరియాలలో భీష్మ బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. దీనితో భారీ లాభాల దిశగా సాగుతుంది.

నాలుగు రోజులలోనే భీష్మ ఆంధ్రా మరియు తెలంగాణాలలో కలిపి 16.71 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి 19.5కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ భీష్మ జరిపినట్లు సమాచారం. దర్శకుడు వెంకీ కుడుముల యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.

నాలుగు రోజులకు ఏరియాల వారీగా ఏపీ/తెలంగాణా వసూళ్ల వివరాలు…

ఏరియ కలెక్షన్స్
నైజాం రూ. 6.64 కోట్లు
సీడెడ్ రూ. 2.55 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 2.13 కోట్లు
కృష్ణ రూ. 1.05 కోట్లు
గుంటూరు రూ. 1.51 కోట్లు
నెల్లూరు రూ. 0.54 కోట్లు
తూర్పు గోదావరి రూ. 1.32 కోట్లు
పశ్చిమ గోదావరిట్ రూ. 0.97 కోట్లు
ఏపీ/ తెలంగాణా నాలుగు రోజుల షేర్ రూ. 16.71 కోట్లు

సంబంధిత సమాచారం :

X
More