రెండో రోజు భారీ వసూళ్లు సాధించిన భీష్మ

Published on Feb 23, 2020 11:13 am IST

నితిన్ లేట్ గా వచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ భీష్మ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో నడిచిన భీష్మ రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. మొదటిరోజు నైజాంలో 2.21 కోట్ల షేర్ రాబట్టిన భీష్మ రెండో రోజు అదే జోరు కొనసాగించింది. దీనితో రెండు రోజులకు 4.19 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో రెండు రోజులకు 1.21 కోట్ల షేర్ వసూలు చేసింది. గుంటూరు 1.03 కోట్లు, కృష్ణ 0.67 కోట్ల షేర్ వసూలు చేసింది.

మొదటి రెండు రోజులలోనే భీష్మ ఆంధ్రా మరియు తెలంగాణాలలో కలిపి 10.52 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది. దర్శకుడు వెంకీ కుడుముల యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.

రెండు రోజులకు ఏరియాల వారీగా ఏపీ/తెలంగాణా వసూళ్ల వివరాలు…

ఏరియ కలెక్షన్స్
నైజాం రూ. 4.19 కోట్లు
సీడెడ్ రూ. 1.40 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 1.21 కోట్లు
కృష్ణ రూ. 0.67 కోట్లు
గుంటూరు రూ. 1.03 కోట్లు
నెల్లూరు రూ. 0.38 కోట్లు
తూర్పు గోదావరి రూ. 0.93 కోట్లు
పశ్చిమ గోదావరిట్ రూ. 0.71 కోట్లు
ఏపీ/ తెలంగాణా రెండు రోజుల షేర్ రూ. 10.52 కోట్లు

సంబంధిత సమాచారం :

X
More