ప్రేమ వివాహం చేసుకోనున్న హీరో నితిన్..!

Published on Dec 12, 2019 11:24 am IST

యంగ్ హీరో నితిన్ వివాహం పై ఓ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. కొంత కాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్ ఆమెను పెళ్లిచేసుకోనున్నారట. ఈమె చిత్ర పరిశ్రమకు చెందినవారు కాదని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ లో హ్యాండ్ సమ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ ను వివాహం చేసుకోనున్న ఆ లక్కీ గర్ల్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయడకుండా లాంగ్ బ్రేక్ తీసుకున్న నితిన్ వరుసగా నాలుగు చిత్రాలు ప్రకటించారు.

దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న భీష్మ, వెంకీ అట్లూరి దర్శకుడిగా రంగ్ దే చిత్రాలు చేస్తున్న నితిన్ చంద్ర శేఖర్ ఏలేటి తో ఒక సినిమా, కృష్ణ చైతన్య అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఏడాది నితిన్ నుండి కనీసం మూడు సినిమాలు వచ్చే అవకాశం కలదు. ఇటీవల విడుదలైన భీష్మ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More