పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యామీనన్?

Published on Jul 8, 2021 1:21 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-దగ్గుబాటి రానా కాంబోలో మలయాళంలో సూపర్ హిట్టయిన ‘అయ్యప్పనుం కోషియం’కు రీమేక్ రానున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు “పరశురామ్ కృష్ణమూర్తి” అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఒరిజినల్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లవి చిన్న చిన్న పాత్రలే అయినప్పటికి ఈ రీమేక్ కథకు మాత్రం గట్టిగా మార్పులు చేస్తున్నారట. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యామీనన్ నటిస్తుందని సమాచారం. అంతేకాదు ఈ బొద్దుగుమ్మ త్వరలోనే పవన్‌తో కలిసి చిత్రీకరణలో పాల్గొనబోతుందట. ఇక ఈ నెల 12 నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండగా 13వ తేదీ నుంచి పవన్ సెట్స్ పైకి రానున్నారట.‌

సంబంధిత సమాచారం :