యంగ్ హీరో నితిన్ వరుస హిట్స్ తో వచ్చిన ఉత్సాహంతో శరవేగంగా పూర్తి చేస్తున్న సినిమా ‘చిన్నదాన నీకోసం’. ఇప్పటికే 90% పైగా షూటింగ్ పూర్తి చేస్తుకున్న ఈ సినిమా బాలన్స్ షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. ఈ రోజు హైదరబాద్ లొ సాంఘి గెస్ట్ హౌస్ లో కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో నితిన్ తో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొంటున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని బార్సెలోనాలో షూట్ చేసారు. నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉండగానే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నాయి.
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ ఈ మూవీకి డైరెక్టర్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్లో ఆడియోని రిలీజ్ చేసి డిసెంబర్ 19న మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


