నితిన్ “భీష్మ” పూజ కార్యక్రమాలతో నేడు ప్రారంభం

Published on Jun 12, 2019 1:51 pm IST

నితిన్,రష్మిక మందాన జంటగా, “ఛలో” ఫేమ్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న నూతన చిత్రం ‘భీష్మ’. ఈ మూవీ నేటి ఉదయం 10 : 19 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది చిత్ర యూనిట్. ఈ సంధర్బంగా నిర్మాత సూర్యదేవర నాగ వంశి మాట్లాడుతూ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ప్రారంభించి, డిసెంబర్ లో ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశాం అన్నారు.

ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు అని అన్నారు. ఈ మూవీ చూసిన ప్రతి అబ్బాయి నితిన్ లా,ప్రతి అమ్మాయి రష్మికలా ఉండాలనుకుంటారన్నారు. కామెడీ తో కూడిన రొమాంటిక్ మూవీ అందరికి నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు , వెంకీ కుడుముల. నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్ లు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. పి.డి .వి. ప్రసాద్ సమర్పిస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More