తన లావు గురించి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చిన హీరోయిన్ !

తన లావు గురించి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చిన హీరోయిన్ !

Published on Sep 9, 2018 7:08 PM IST

nitya menon
ఏ కాలంలోనైనా తమ నటనతో ఆకట్టుకునే హీరోయిన్స్ లో కొద్ధిమంది మాత్రమే ఉంటారు. ఇక ఈ దశాబ్దంలో వచ్చిన హీరోయిన్స్ ను చూసుకుంటే అతి తక్కువమంది మాత్రమే, తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్తానం కల్పించుకోగలిగారు. అలాంటి హీరోయిన్ లో నిత్యామీనన్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. అయితే నిత్యామీనన్ సడెన్ గా రెండేళ్ల నుంచి సినిమాలు తగ్గిస్తూ వస్తోంది. ఇటీవలే విడుదలైన గీతగోవిందం చిత్రంలో ఓ సాధారణ గెస్ట్ రోల్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

కాగా నిత్యామీనన్ గీతగోవిందం చిత్రంలో బాగా లావు అయిపోయి కనిపించడంతో, సోషల్ మీడియాలో ఆమె పై కొంతమంది నెటిజన్లు విమర్శల రూపంలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవలే నిత్యామీనన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రశ్నించగా.. నిత్యా తన లావు గురించి మాట్లాడుతూ.. నాకస్సలు అలాంటి ఫీలింగే ఉండదని, తాను ఎప్పుడూ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ పొట్టి, లావుల గురించి విమర్శించే వాళ్లను చూస్తే తనకు నవ్వొస్తుందని కూడా తెలిపింది. మొత్తానికి నిత్యామీనన్ కి తన ఫిటినెస్ మీద బాగానే క్లారిటీ ఉన్నట్లు ఉందిగా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు