తిరిగి సినిమాలు చేయబోయేది ఎప్పుడో చెప్పిన నివేత థామస్ !

7th, April 2018 - 02:12:21 PM


చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి నటిగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ నివేత థామస్. చివరగా ఎన్టీఆర్ సరసన ‘జై లవ కుశ’ చిత్రంలో కనిపించిన ఆమె ఆ తర్వాత కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. మధ్యలో కొందరు యువ హీరోలతో ఆమె తర్వాతి సినిమాలుంటాయని వార్తలొచ్చిన వాటిపై ఇంకా క్లారిటీ రాలేదు.

తాజాగా ట్విట్టర్ ద్వారా మాట్లాడిన ఆమె ఇకపై ‘చాలా మంది తన తరవాతి సినిమా ఏమిటో చెప్పమని అడుగుతున్నారు. జై లవ కుశ తర్వాత నా గ్రాడ్యుయేషన్ చివరి సెమిస్టర్ పూర్తిచేయడానికి కొంత బ్రేక్ తీసుకున్నాను. కథలు, స్క్రిప్ట్స్ వింటూనే ఉన్నాను. త్వరలోనే కొత్త సినిమాని ప్రకటిస్తాను’ అంటూ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.