నందమూరి హీరో సినిమా షూటింగ్లో జాయిన్ అయిన నివేత థామస్ !

Published on May 28, 2018 8:07 pm IST


నందమూరి కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ‘నా నువ్వే’ షూట్ ముగించిన అయన తన 16వ సినిమాను ప్రముఖ సినిమాటోగ్రఫర్ కెవి.గుహన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఇప్పటికే మొదలైపోయింది.

ఇందులో నివేత థామస్, షాలిని పాండేలు కథానాయికలుగా నటించనుండగా నివేత ఈరోజు నుండే షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుత షూటింగ్ హైదారాబాద్లో జరుగుతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇకపోతే జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘నా నువ్వే’ చిత్రం జూన్ 14న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :