‘జై లవ కుశ’ కు బెనిఫిట్ షోలు ఉండవట!
Published on Sep 20, 2017 5:31 pm IST


ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం రేపు రిలీజ్ కానుంది. అయితే ఆనవాయితీ ప్రకారం ముందురోజు వేసే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోల గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రీమియర్ షోలైతే లేవని ముందుగానే తేలిపోయింది కానీ బెనిఫిట్ షోల విషయంలో అయితే ఇప్పటి వరకు చిత్ర టీమ్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే సినీ వర్గాల టాక్ ప్రకారం హైదరాబాద్ నగరంలో పోలీసు అనుమతి లేని కారణంగా తెల్లవారుజామున్నే వేసే ఈ బెనిఫిట్ షోలు కూడా లేవని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం రేపు సుమారు 2400 ప్లేకు పైగా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో తారక్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 
Like us on Facebook