నాని ఇంట్రెస్టింగ్ సినిమాకు నో బ్రేక్స్..?

Published on May 6, 2021 7:04 am IST

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం “టక్ జగదీష్” ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు కూడా రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అలాగే దీనికి మించిన అంచనాలు మాత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్” పై ఉన్నాయి.

అయితే ఈ సెకండ్ వేవ్ లో ఎన్నో చిత్రాలు ఆగినా ఇది మాత్రం ఆగలేదు. అందులో భాగంగానే అన్ని జాగ్రత్తలతో ఈ చిత్రం షూట్ కూడా ఇంకా జరుగుతుందట. అంతే కాకుండా ఆల్ మోస్ట్ షూట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిపోతుండటంతో ఆలస్యం చేయకూడదని శరవేగంగా కంప్లీట్ చేసేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా నిహారిక ప్రొడక్షన్స్ వారు నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :