నిఖిల్ సినిమా సంగతేంటి ?

నిఖిల్ సినిమా సంగతేంటి ?

Published on Jan 31, 2018 3:44 PM IST

విజయపథంలో దూసుకుపోతున్న మన యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ కూడా ఒకరు. ‘కేశవ’ తర్వాత ఈయన కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగులో ‘కిర్రాక్ పార్టీ’గా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిన రిలీజ్ చేస్తామని యూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రిలీజ్ డేట్ దగ్గరకొస్తున్నా ఈరోజు విడుదలకాబోయే ట్రైలర్ మినహా పెద్దగా హడావుడి కనబడటంలేదు.

దీనికి కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాలేదని, హడావుడిగా చేసే బదులు కొంత సమయం తీసుకుని క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకి అందించాలనే ఉద్దేశ్యంతో సినిమాను వాయిదావేయాలనే ఆలోచన చేస్తున్నారట టీమ్. మరి ఈ వార్తలు నిజమో కాదో.. ఒకవేళ నిజమే అయితే కొత్త విడుదలతేదీ ఎప్పుడో తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే. నూతన దర్శకుడు శంకర్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కన్నడ నటి సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు