డియర్ కామ్రేడ్ విడుదల తేది ఫై క్లారిటీ రావడం లేదు !

Published on Apr 28, 2019 1:49 pm IST

బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ , రష్మిక రెండవ సారి జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం యొక్క షూటింగ్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది. అయితే ఈచిత్రం యొక్క విడుదలతేది ఫై చిత్ర బృందం ఎటు తేల్చుకోలేకపోతుంది. మొదటగా ఈ చిత్రాన్ని మే 31న తెలుగు తో పాటు కన్నడ,మలయాళ, తమిళ భాషల్లో విడుదలచేయనున్నామని ప్రకటించారు. అయితే అక్కడే సమస్య మొదలైయింది. ఇక అదే రోజు స్టార్ హీరో సూర్య నటించిన ఎన్ జి కె విడుదలకానుంది అయితే ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతున్న డియర్ కామ్రేడ్ కు పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు కానీ తమిళ,మలయాళంలో మాత్రం ఈ ఎఫెక్ట్ భారీగా ఉండనుంది. దాంతో డియర్ కామ్రేడ్ ను విడుదలతేది ను మార్చనునుట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే మేకర్స్ నుండి త్వరలోనే ఈ విడుదల తేదీ ఫై మరో ప్రకటన వెలుబడనున్నట్లు సమాచారం. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :