మజిలీ కంఫర్మ్ మరి జెర్సీ .. ?

Published on Feb 23, 2019 3:40 pm IST


నాని , నాగ చైతన్య లకు ఇటీవల సరైన హిట్లు లేవు. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ ఇద్దరు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా నాని జెర్సీ లో నటిస్తుండగా నాగ చైతన్య మజిలీ చిత్రంలో నటిస్తున్నాడు. రెండు క్రికెట్ బేస్డ్ స్టోరి తో రానున్నడం తో ఇప్పటికే వాటిపై మంచి హైప్ వుంది. ఇక మజిలీ షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా చిత్రం బృందం ఒక వీడియో ను రిలీజ్ చేసింది. సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం ఏప్రిల్ 5న వస్తున్నాం అని సందేశం ఇచ్చారు. సో మజిలీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపొయింది.

ఇక జెర్సీ విషయానికి వస్తే షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లోవుంది. అయితే ఈసినిమా విడుదల తేదీ ఫై క్లారిటీ రావడం లేదు. మొదటగా ఏప్రిల్ 19న విడుదల చేస్తామని ప్రకటించిన తాజాగా విడుదలచేసిన పోస్టర్ల ఫై ఆ డేట్ ను తీసేసి ఏప్రిల్లో విడుదల అని వేశారు. దాంతో ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 5నే విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా కంఫర్మ్ చేయలేదు.

ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం కన్నా సోలో గా వస్తేనే రెండిటికి మేలు. ఎలాగూ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి ఏప్రిల్ 25న విడుదలకాదని తెలిసిపోయింది. సో జెర్సీ ని ముందుగా అనుకున్నట్లు 19న విడుదలచేస్తే నే బెటర్. మరి ఈ రిలీజ్ డేట్ విషయంలో జెర్సీ మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :