ఈవారం కూడా కార్తీ,విజయ్ లదే

Published on Nov 7, 2019 12:00 am IST

గత నెల 25న దీపావళి సంధర్భంగా కోలీవుడ్ కి చెందిన రెండు పెద్ద చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిలో ఒకటి విజయ్ నటించిన బిగిల్ కాగా రెండవది కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ మూవీ. తెలుగు తమిళ భాషలలో బైలింగ్వల్ చిత్రాలుగా విడుదలైన ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. 180కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బిగిల్ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 250కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఇక కార్తీ ఖైదీ వరల్డ్ వైడ్ గా 80కోట్లకు మించిన వసూళ్లు సాధించినట్టు సమాచారం. దీపావళి సీజన్ కావడంతో పాటు ఈ రెండు చిత్రాలకు పోటీనిచ్చే చిత్రాలు కూడా లేకపోవడం భారీ వసూళ్లకు మార్గం ఏర్పడింది.

కాగా ఈవారం కూడా అటు కోలీవుడ్ లో కానీ, ఇటు టాలీవుడ్ లో కానీ పెద్ద చిత్రాల విడుదల లేదు. ముఖ్యంగా తెలుగులో శ్రీవిష్ణు హీరోగా కృష్ణ విజయ్ తెరకెక్కించిన తిప్పరా మీసం, మరో చిన్న చిత్రం మాత్రమే విడుదల అవుతున్నాయి. ఇక కోలీవుడ్ లో ధృవ్ విక్రమ్ నటించిన ఆదిత్య వర్మ చిత్ర విడుదల వాయిదాపడటంతో అక్కడ విజయ్, కార్తీ చిత్రాలకు పోటీ లేకుండా పోయింది. దీనితో ఈ వారం కూడా బిగిల్, ఖైదీ చిత్రాలు సోలోగా బాక్సాఫీస్ ని దున్నుకోవడం ఖాయం.

సంబంధిత సమాచారం :

X
More