‘సమ్మోహనం’లో ఎలాంటి కాంట్రవర్సీ ఉండదట !

‘సమ్మోహనం’లో ఎలాంటి కాంట్రవర్సీ ఉండదట !

Published on Jun 5, 2018 6:06 PM IST

ఈ నెలలో విడుదలకానున్న ఆసక్తికరమైన సినిమాల్లో ‘సమ్మోహనం’ కూడ ఒకటి. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ సంపాదించుకున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, అదితి రావ్ హైదరిలు జంటగా నటించారు. సినిమాలో హీరో పాత్రకు సినిమా హీరోయిన్లంటే కాస్తంత చిన్న చూపు ఉంటుంది. టీజర్లో కూడ అదే విషయాన్ని హైలెట్ చేశారు దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి.

ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలని సినిమాలో ప్రస్తావిస్తారేమోనని అనుకుంటున్నారు. కానీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అలాంటి కాంట్రావర్సీలు ఏవీ సినిమాలో ఉండవని, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూసే సినిమా అని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే రేపు సెన్సార్ కు వెళ్లనున్న ఈ చిత్రం జూన్ 15 న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు