‘ధృవ’పై వస్తోన్న పుకార్లను కొట్టిపడేసిన టీమ్!
Published on Aug 24, 2016 3:21 pm IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ సినిమా దసరా రేసు నుంచి తప్పుకుందని, దీపావళికి వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ప్రచారంపై స్పందిస్తూ ధృవ టీమ్ ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ‘ధృవ’ దసరా సీజన్‌కు రావట్లేదంటూ జరుగుతున్న ప్రచారమంతా పుకారనీ, సినిమా అనుకున్న తేదీకే అక్టోబర్ 7న పక్కాగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీమ్ స్పష్టం చేసింది.

ప్రస్తుతం టాకీ పార్ట్ చివరిదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా పూర్తవుతోంది. సెప్టెంబర్ 5కల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని, దసరా సీజన్లోనే సినిమా విడుదలవుతుందని ధృవ టీమ్ తెలిపింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ అయిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 
Like us on Facebook