విజయ్ “వారసుడు” నుంచి ఎలాంటి లీక్ బయటకి రాలేదు.!

Published on Jul 13, 2022 9:00 am IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వరిసు” తమిళ్ మరియు తెలుగులో “వారసుడు” గా ఏకకాలంలో తెరకెక్కిస్తున్న బై లాంగువల్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వంశీ పైడిపల్లి భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ సినిమాని దర్శకుడు సహా చిత్ర బృందం చాలా జాగ్రత్తగా ఎలాంటి లీక్స్ లేకుండా షూటింగ్ చేస్తుండగా ఇప్పుడు పిక్ వారసుడు షూట్ లోది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది అసలు ఈ సినిమాలోనిదే కాదని తెలుస్తుంది.

ఈ చిత్రం నుంచి ఎలాంటి లీక్ బయటకి వెళ్లలేదని అది జస్ట్ అభిమానులు క్రియేట్ చేసుకున్న వేరే ఏదో సినిమాలో విజువల్ అని తెలుస్తుంది. విజయ్ సినిమా నుంచి అయితే ఎలాంటి లీక్స్ బయటకి రాలేదు అనేది మాత్రం ఇప్పుడు స్పష్టం.

సంబంధిత సమాచారం :