బిగ్ బాస్ లో ఇకపై మిత్రులైనా,శత్రువులై పోవాల్సిందే.

బిగ్ బాస్ లో ఇకపై మిత్రులైనా,శత్రువులై పోవాల్సిందే.

Published on Oct 16, 2019 9:02 AM IST

big boss

బిగ్ బాస్ ఫైనల్స్ కు ఇంకా కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో బిగ్ బాస్ లో ఫైనల్స్ హీట్ మొదలైంది. ఇప్పటివరకు షో లో సేఫ్ గేమ్ ఆడుతూ సర్వైవ్ అవుతూ వచ్చిన కంటెస్టెంట్స్ కి కష్టకాలం మొదలుకానుంది. రాబోయే ఎపిసోడ్స్ చాలా కఠినంగా, ఉత్కంఠగా ఉంటాయని సమాచారం. ఇంటి సభ్యులందరి మధ్య సెగ రాజేసేలా ఈ టాస్క్ లు ఉంటాయని తెలుస్తుంది. అందరితో మంచిగా రిలేషన్స్ కొనసాగిస్తూ ప్రేక్షకుల దృష్టిలో మంచివారిగా కొనసాగుతూ ఓట్లు కొట్టేస్తాం అంటే కుదరదు. ఇకపై ఉండే టాస్కులు ప్రతి కంటెస్టెంట్ మరొక కంటెస్టెంట్ పై ఉన్న అభిప్రాయం కొండబద్దలు కొట్టేదిగా ఉంటాయి.

కఠినమైన శారీరక మరియు మానసికమైన టాస్కుల వలన ఒకరిమధ్య ఒకరికి గొడవలు జరిగే అవకాశం కలదు. ఇక గత వారం మహేష్ ఎలిమినేషన్ తో ఇంటిలో ఇంకా ఏడుగురు సభ్యులు మిగిలారు. వీరిలో ఫైనల్ ఎపిసోడ్ కి ఐదుగురు వెళతాడు. ఆ ఐదుగురిలో ఇద్దరు టైటిల్ కొరకు పోటీపడతారు. కాగా శివ జ్యోతి, వితిక, అలీ రెజా లలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు