దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి హీరోయిన్ గా సమంతా.!

Published on Jan 23, 2021 8:00 am IST

అక్కినేని కోడలు సమంతా అక్కినేని గ్లామరస్ రోల్స్ నుంచి ఎలాంటి రోల్స్ ను అయినా పండించగలిగే సెటిల్డ్ హీరోయిన్ గా తనకంటూ ఒక బెంచ్ మార్క్ అలాగే తన సినిమాలకు మార్కెట్ ను సెట్ చేసుకుంది. మరి అలా కేవలం సినిమాల్లోనే కాకుండా ఓటిటిలోకి కూడా ఆమె అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోని బిగ్గెస్ట్ హిట్ కాబడిన వెబ్ సిరీస్ లలో “ది ఫ్యామిలీ మ్యాన్” కూడా ఒకటి.

మరి దీనికి కొనసాగింపుగా సీజన్ 2 ను కూడా మేకర్స్ సిద్ధం చెయ్యగా ఇందులో సమంతా కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. మరి ఈ రోల్ కు సంబంధించి మన దేశంలోనే ఏ స్టార్ హీరోయిన్ కు కూడా దక్కని ఘనతను మొట్ట మొదటి సారిగా తన ఖాతాలో వేసుకుంది. ఈ వెబ్ సిరీస్ కు గాను ట్విట్టర్ లో ఆమెకు ఒక ప్రత్యేకమైన ఎమోజిని మేకర్స్ సిద్ధం చేయించి ప్రమోషన్స్ లో వాడుతున్నారు.

ఇది ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోలకు అయితే చూసాం గాని ఇలా ట్విట్టర్ నుంచి ఒక హీరోయిన్ కు చెయ్యడం అనేది ఇదే మొట్ట మొదటి సారి. అందుకే మన దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి హీరోయిన్ గా సమంతా రికార్డ్ సెట్ చేసింది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ వచ్చే ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం :