నైజాంలో ‘మహర్షి’ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on May 15, 2019 1:29 pm IST

రిలీజ్ అయి ఆరు రోజులు అవుతున్న నైజాంలో ‘మాహర్షి’ కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. ఇప్పటికే నైజాంలో మహర్షి బ్రేక్ ఈవెన్ అయింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. ఇక మాహర్షి నైజాంలో ఆరో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

మంగళవరం నాడు ‘మహర్షి’ నైజాంలో 1.53 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో మహర్షి మొత్తం ఆరు రోజుల షేర్ 20.54 కోట్లుగా ఉంది. మొత్తానికి నైజాంలో మహేశ్ మార్కెట్ రేంజ్ ‘మహర్షి’ మరోసారి గుర్తు చేశాడు. గతంలో కూడా మహేశ్ సూపర్ హిట్ చిత్రాలు నైజాంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. కానీ ‘మహర్షి’ వాటన్నిటినీ దాటేసింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో అన్ని ఏరియాల్లోనూ బాక్సాఫీస్ వద్ద మహేష్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.

సంబంధిత సమాచారం :

More