సైరా యాక్షన్ ఎపిసోడ్ బడ్జెట్లో నిజం లేదట !

Published on Oct 1, 2018 7:41 pm IST


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం జార్జియా లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా చిరు కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ కు రూ.50 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

సైరాలో మొత్తం నాలుగు యాక్షన్ ఎపిసోడ్ లు వున్నాయి. ఫస్ట్ పార్ట్ లో రెండు అలాగే సెకండ్ పార్ట్ లో రెండు గా సినిమాలో వుండనున్నాయి. ఈమొత్తం సీక్వెన్స్ బడ్జెట్ కలిపితే సుమారు రూ.50కోట్ల దాక అవుతుంది అంతే తప్ప ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు అన్న వార్తల్లో నిజం లేదు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలకానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుమారు రూ. 200కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :