మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వైరల్ టాక్ లో ఎలాంటి నిజం లేదా?

Published on Jul 24, 2021 11:43 pm IST


మన టాలీవుడ్ ప్రతీ స్టార్ట్ హీరోకి అలాగే ప్రతీ స్టార్ దర్శకునికి ఉన్నట్టుగా కొన్ని సెపరేట్ కాంబోస్ అంటే ఎనలేని క్రేజ్ ఉంటుంది. మరి అలాంటి సాలిడ్ కాంబోలలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లది కూడా ఒకటి. వీరి కాంబో నుంచి వచ్చిన రెండు సినిమాలు కూడా కమెర్షియల్ గా పూర్తి స్థాయిలో అప్పట్లో ఆకట్టుకోకపోవచ్చు.

కానీ మెల్లమెల్లగా మాత్రం వీరి నుంచి వచ్చిన రెండు సినిమాలు కూడా టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సినిమాల్లా మారాయి. అందులో ఫలితంతో సంబంధం లేకుండా వీరి హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి కూడా ఆసక్తికర గాసిప్పులే వినిపిస్తూ వస్తున్నాయి.

అలా తాజాగా ఈ చిత్రంలో మహేష్ సరసన స్టార్ హీరోయిన్ ని త్రిషని చూపనున్నారని టాక్ నడుస్తుంది. గతంలో వీరు “అతడు” సినిమాకి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ టాక్ లో మాత్రం ఎలాంటి నిజం లేనట్టుగా సమాచారం. ఇవన్నీ జస్ట్ ఊహాగానాలే అని తెలుస్తుంది. మరి మహేష్ సరసన ఈ చిత్రంలో ఎవరు నటిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :