ప్రియా ప్రకాష్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన సహ నటి !

Published on Feb 23, 2019 11:20 am IST


ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ఓరు ఆధార్ లవ్ (లవర్స్ డే ) పూర్ రేటింగ్స్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేక చేతులెత్తేసింది. అయితే ఈచిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించిన యువ నటి నూరిన్ షరీఫ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా నూరిన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమా గురించి సంచలన విషయాలు వెల్లడించింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ నేను కానీ వింక్ వీడియో తో ఓవర్ నైట్ లో ప్రియా ప్రకాష్ స్టార్ కావడంతో మేకర్స్ స్క్రిప్ట్ ను మార్చి ఆమె కు మెయిన్ హీరోయిన్ రోల్ ఇచ్చారు. ఇక మీదట ప్రియా ప్రకాష్ తో కలిసి నటించనని నూరిన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇక సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో సినిమా క్లైమాక్స్ ను మార్చి మళ్ళీ విడుదలచేసిన ఫలితం లేకుండా పోయింది. లవర్స్ డే తో తెలుగులో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

సంబంధిత సమాచారం :