తన రోడ్డు ప్రమాదం పై స్పందించిన హీరోయిన్ !

తన రోడ్డు ప్రమాదం పై స్పందించిన హీరోయిన్ !

Published on Dec 21, 2025 2:09 PM IST

norafathei

బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఐతే, తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని నోరా ఫతేహి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ.. ‘డ్రింక్‌ చేసిన ఓ కారు డ్రైవర్‌ నా కార్ ను ఢీ కొట్టాడు. దీంతో, నా తల, కారు విండోకు బలంగా తలిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. అయితే, ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. కాకపోతే, తల వాపు ఉంది. ఇంకా కొన్ని గాయాలు మానలేదు’ అని నోరా ఫతేహి తెలిపారు.

నోరా ఫతేహి ఇంకా మాట్లాడుతూ.. ఆ ప్రమాదాన్ని భయానక ఘటనగా అభివర్ణించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను ప్రోత్సహించొద్దని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌తో ఎంతోమంది అమాయక ప్రజలు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని నోరా ఫతేహి ఎమోషనల్ అయ్యారు. నోరా ఫతేహి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు