ఓవర్సీస్లో ‘గద్దలకొండ గణేష్’ దూకుడెలా ఉంది

Published on Sep 21, 2019 12:25 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘గద్దలకొండ గణేష్’ ఈరోజే విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఓవర్సీస్లో మాత్రం సాధరణంగానే రన్ మొదలుపెట్టింది. ట్రేడ్ లెక్కల మేరకు పీమియర్ల ద్వారా 75,000 డాలర్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రం. ఇది వరుణ్ తేజ్ గత చిత్రం ‘అంతరిక్షం’ ఓపెనింగ్స్ కంటే తక్కువే.

ఇక ఈరోజు వస్తున్న పాజిటివ్ టాక్ మూలాన వారాంతంలో ఈ వసూళ్లు పుంజుకునే వీలుంది. పక్కా మాస్ చిత్రం కావడం కూడా ఓపెనింగ్స్ తగ్గడానికి ఒక కారణం కావొచ్చు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More