ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం పెద్ది కూడా ఒకటి. నిజానికి ఈ వేసవిలో బాక్సాఫీస్ దాహాన్ని తీర్చేది ఈ సినిమానే అని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన మొదటి సారి జాన్వీ కపూర్ జత కట్టింది.
జాన్వికి ఇది తెలుగులో రెండో సినిమా కాగా అసలు ఈ సినిమా జాన్వీ చేయాల్సిన సినిమానే కాదు అని రివీల్ అయ్యింది. దర్శకుడు బుచ్చిబాబు సానా లేటెస్ట్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. తాము ముందుగా జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ ని పెద్ది సినిమాలో హీరోయిన్ గా అనుకున్నట్టు అసలు విషయం తెలిపారు.
ఇలా చెల్లెలి కోసం సినిమాలో అనుకుంటే అదే ఇంటి నుంచి ఆమెని రిజెక్ట్ చేసి అక్కని ఫైనల్ చేయాల్సి వచ్చింది అని బుచ్చిబాబు క్రేజీ ట్విస్ట్ రివీల్ చేశారు. మరి జాన్వీ కాకుండా ఖుషి కపూర్ ఈ సినిమాలో చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ డెబ్యూ అయ్యి ఉండేది అని చెప్పొచ్చు.


