ప్రభాస్ మిస్ చేసుకున్న క్రేజీ మైండ్ గేమ్ ప్రాజెక్ట్!

ప్రభాస్ మిస్ చేసుకున్న క్రేజీ మైండ్ గేమ్ ప్రాజెక్ట్!

Published on Jan 18, 2026 9:00 PM IST

Prabhas

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తన కెరీర్లో ఒక దానికి సంబంధం లేకుండా ఒకో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి ఎపిక్ సినిమాని చేసిన తర్వాత కూడా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వచ్చిన తాను అందరి హీరోస్ లానే పలు సినిమాలు తన కోసం రాయబడి మిస్ అయ్యాయి. మరి ఇలాంటి చిత్రాల్లో యునిక్ సినిమా కూడా మిస్ అయ్యిందట.

తమిళ్ లో అలాగే తెలుగులో ‘ధృవ’ సినిమా అంటే తెలియని వారు ఉండరు. ఒరిజినల్ గా తని ఒరువన్ అంటూ దర్శకుడు మోహన్ రాజా, తన సోదరుడు జయం రవితో చేసి హిట్ కొట్టారు. తెలుగులో కూడా రామ్ చరణ్ చేసి హిట్ కొట్టాడు. అయితే అసలు ఈ సినిమాకి మొదటి ఛాయిస్ ప్రభాస్ అట. ప్రభాస్ కోసమే ఈ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసినట్టు గాడ్ ఫాదర్ దర్శకుడు రివీల్ చేశారు. నిజానికి ఇది స్టేట్మెంట్ నే అయినప్పటికీ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ సినిమా అప్పట్లోనే ప్రభాస్ చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. అలాగే ప్రభాస్ ని పోలీస్ గా చూడాలి అనుకున్న ఫ్యాన్స్ కోరిక కూడా అప్పుడే నెరవేరేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు