చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత కన్నుమూత.

Published on Jul 25, 2019 10:29 am IST

ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నేటి ఉదయం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు.ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈయన కుమారుడు. ఏళ్లుగా ఆయన సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారు. కథలు, పాటలతో పాటు, ఆయన అనేక పుస్తకాలు రాశారు. కృష్ణవతారం, నెలవంక, రెండు జళ్ల సీత, పుత్తడి బొమ్మ వంటి చిత్రాలకు ఆయన పాటలు రాయడం జరిగింది. ఆంధ్ర జ్యోతి దినపత్రికలో తన కెరీర్ ప్రారభించిన శ్రీకాంత్ శర్మ అల్ ఇండియా రేడియో లో పనిచేశారు.

తాజాగా సమ్మోహనం చిత్రంలో ఆయన “మనసైనదేదో” అనే పాటను రాయడం జరిగింది. ఆయన మృతుకి చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. హీరో నాని, దర్శకుడు హరీష్ శంకర్ ఆయన మృతికి సంతాపం తెలిపారు.

సంబంధిత సమాచారం :