ప్రముఖ ఛానెల్ చేతికి ‘అఅఆ’ శాటిలైట్ హక్కులు !

Published on Oct 31, 2018 2:32 am IST


మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈచిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమినీ టీవీ భారీ ధరకు దక్కించుకుందని సమాచారం. ఇక నిన్న విడుదలైన ఈ చిత్ర టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఈ టీజర్ యూట్యూబ్ లో 40లక్షల పైచిలుకు వ్యూస్ ను రాబట్టింది.

శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించగా సునీల్ ముఖ్య పాత్రలో నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 16న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :