ప్రభాస్ కి స్టోరీ చెప్పిన క్రేజీ డైరెక్టర్ ?

Published on Nov 18, 2019 11:00 pm IST

ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. దాంతో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనా.. ఎన్టీఆర్‌తోనా అని ఇప్పటికే గత కొన్ని రోజులుగా వార్తల వస్తూనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి కథ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ తోనూ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ పూర్తై ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టేనాటికి వచ్చే యేడాది ఆఖరు అవుతుంది కాబట్టి ఈలోపు స్వయంగా ప్రశాంత్ నీల్ సినిమా ఎవరితో అని క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :