మహేష్ తో ప్రముఖ దర్శకుడు కుమారుడు !

Published on Aug 9, 2021 12:15 pm IST

దర్శకుడు గోపీచంద్ మలినేని తనయుడు సాత్విక్ చంద్ క్రాక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే యాక్టింగ్ ఇరగదీశాడు సాత్విక్. ‘క్రాక్’ సినిమాలో హీరో రవితేజ కొడుకుగా నటించి తన మాట తీరుతో పాటు తన ఎక్స్ ప్రెషన్స్ తోనూ మంచి ప్రతిభ కనబర్చాడు.

మొత్తానికి ఆ సినిమాలో సాత్విక్ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే, సాత్విక్ చంద్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫేవరేట్ హీరో అట. మహేష్ బాబు పట్ల తన కుమారుడి అభిమానాన్ని చూసి.. గోపీచంద్ మలినేని ‘సర్కారు వారి పాట’ సెట్స్‌ కి సాత్విక్ ను తీసుకెళ్లి, మహేష్ తో నేరుగా కలిపించి ఒక ఫోటో కూడా తీయించాడు.

ఈ ఫోటోలో సూపర్‌ స్టార్‌ పక్కన సాత్విక్ కూడా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట టీజర్ బాగా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :