ప్రభాస్ కి తల్లిగా మాజీ బ్యూటీ !

Published on Jan 22, 2020 3:10 pm IST

భాగ్యశ్రీ ఒకప్పటి అందాల తారగా తెలుగు ప్రేక్షుకులకు ఇప్పటికీ గుర్తే. పైగా బాలీవుడ్‌ లో భాగ్యశ్రీకి బలమైన ఫాలోయింగే ఉంది. తన అందచందాలతో పాటు తన నటనతోనూ ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కాగా తెలుగు సినిమాలకి ఎప్పుడో దూరమైపోయిన భాగ్యశ్రీను రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ టాలీవుడ్ కి తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్, ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించబోతుందట. మరి ఈ మాజీ గ్లామర్ బ్యూటీ ప్రభాస్ కి తల్లిగా అంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఎప్పుడో మొదలవ్వాల్సిన జాన్ కొత్త షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం నుండి మొదలు కానుంది.

కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి టైటిల్ ‘జాన్’ ప్రచారంలో ఉంది.

సంబంధిత సమాచారం :