కేరళ కు ప్రముఖ నిర్మాత సాయం !

కేరళ కు ప్రముఖ నిర్మాత సాయం !

Published on Aug 19, 2018 11:41 PM IST

DIL RAJU

గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న దక్షిణాది రాష్ట్రం కేరళను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. భాషతో సంభందం లేకుండా దేశ వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా విరాళాలను ప్రకటించారు. ఇక తెలుగు , తమిళ సినీ పరిశ్రమ నుండి ప్రముఖ నటీనటులు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

ఈరోజు నాగ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, కళ్యాణ్ రామ్, రామ్ , వరుణ్ తేజ్ లు ముందుకొచ్చి తమ వంతు సహాయంగా విరాళాలను అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 10లక్షల రూపాయలను విరాళం గా ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు