సీనియర్ నటుడు వినోద్ శనివారం తెల్లవారుజామున 2:00 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ తో తన నివాసంలో కన్నుముశారు. విలన్ గా సహాయ నటుడిగా దాదాపు 300 కు పైగా చిత్రాల్లో నటించారు. లారీ డ్రైవర్, చంటి,ఇంద్ర, నరసింహ నాయుడు మొదలగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు ఎక్కువగా ఫ్యాక్షన్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లోను నటించి బుల్లితెర ప్రేక్షకులను సైతం మెప్పించారు. ఇక తెలుగు తో పాటు తమిళభాషలో 28 చిత్రాల్లో అలాగే హిందీలో రెండు చిత్రాల్లో నటించిన వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాడ సంతాపం తెలియజేశారు.


