కరోనాతో ప్రముఖ టాలీవుడ్ నటుడు మృతి

Published on Sep 23, 2020 11:35 pm IST

ఇటీవలే ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరొక ప్రముఖ తెలుగు నటుడు కోసూరి వేణుగోపాల్ మరణించారు. కరోనా బారిన పడిన గత 22 రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించి పరిస్ఠితి విషమించడంతో ఈరోజు బుధవారం కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

వేణుగోపాల్ ‘మర్యాదరామన్న, ఛలో, విక్రమార్కుడు, పిల్ల జమీందార్’ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హాస్యాన్ని పండించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు ఆయన. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడే సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన ఆయన పదవీవిరమణ అనంతరం కూడ నటనను కొనసాగించారు.

సంబంధిత సమాచారం :

More