ఇక పవర్ స్టార్ టైం స్టార్ట్ అయ్యిందా.!

Published on Oct 1, 2020 10:00 am IST

దాదాపు రెండున్నరేళ్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై పడనుంది. కాస్త ఆలస్యం అయినా సరే తన కం బ్యాక్ చిత్రం మాత్రం వెండితెర మీదనే ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసారు. ఆ చిత్రమే “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెలుగులో పవన్ తో దర్శకుడు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా లేకుండా ఉంటే ఈ పాటికే ఎప్పుడూ విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేట్రికల్ రిలీజ్ కే రెడీ అయ్యింది.

అయితే ఈ చిత్రంకు భారీ ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ నిర్మాత దిల్ రాజు మాత్రం థియేటర్స్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అయితే ఇంకా ఎక్కడో సంశయం ఉండనే ఉండింది. అదే అసలు థియేటర్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అని. కానీ ఇపుడు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ ఓపెనింగ్ పై క్లారిటీ ఇచ్చేసరికి ఒక్కసారిగా పవన్ అభిమానుల కళ్ళు ఈ చిత్రంపై పడ్డాయి.

చాలా లేట్ అవుతుంది అనుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదల అవుతుంది అనే దానితో పాటు ఏమో తొందరగానే ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఎలాగో ఇప్పుడున్న స్టార్ హీరోల చిత్రాల్లో పవన్ దే భారీ చిత్రం కావడంతో పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. దీనితో మరోసారి పవర్ స్టార్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More