బిగ్ బాస్ 4 – ఇపుడు వీరు ఈమెకి సపోర్ట్ చేస్తారా.?

బిగ్ బాస్ 4 – ఇపుడు వీరు ఈమెకి సపోర్ట్ చేస్తారా.?

Published on Nov 24, 2020 11:00 AM IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ లో రోజులు గడుస్తున్నా కొద్దీ పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. ఇక ఈ నెల ఎలాగో అయ్యిపోతే వచ్చే నెలలో ఈ గ్రాండ్ రియాలిటీ షోకు గాను ఫైనల్స్ బెల్స్ మోగనున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి నామినేషన్స్ ప్రక్రియ ఊహించని మలుపులతో నమోదు అయ్యింది.

ముఖ్యంగా సేఫ్ జోన్ లో ఉన్నటువంటి మోనాల్ అఖిల్ కు సపోర్ట్ చెయ్యకపోవడం అతని ఫాలోవర్స్ మరియు బిగ్ బాస్ వీక్షకులకు షాక్ ఇచ్చింది. దీనితో ఇన్నాళ్లు కాస్తయినా ఉన్న అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ ఇపుడు మోనాల్ కు లేకుండా పోయింది. కానీ అభిజీత్ విషయంలో మాత్రం కాస్త పాజిటివిటీని ఆమె సంపాదించుకున్నట్టు అనిపిస్తుంది.

తాను ఎవరిని సేవ్ చెయ్యాలి అనే ఆప్షన్ లో అభిజీత్ తాను తన పాయింట్ ను చెప్పి ఎమోషనల్ అయ్యాడు. దానితో మోనాల్ అలాగే అభి కు కూడా మరో ఛాయిస్ లేకపోయింది. అలాగే తర్వాత హారిక, మోనాల్ ను అభిజిత్ తో స్వాప్ చెయ్యడంతో మోనాల్ కు అభిజిత్ ఫాలోవర్స్ విషయంలో కాస్త పాజిటివిటి వచ్చింది. మరి ఇప్పుడు వారు ఈమెకు సపోర్ట్ అయితే చేస్తున్నారు కానీ వోటింగ్ చేస్తారో లేదో అన్నది క్లారిటీ లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు