
ఆస్టిన్ ఎన్నారై తెదేపా ఆద్వర్యంలో ఆదివారం భారీ కారు ర్యాలీ, విజయోత్సవ సభ, ఎన్టీఆర్ జన్మదిన వేడుకను నిర్వహించారు. 50 కి పైగా కార్లతో నిర్వహించిన ఈ ర్యాలీలో షుమారు వంద మందికి పైగా అభిమానులు పాల్గొని పసుపు జెండా రెప రెపలతో కనువిందు చేశారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి జ్యోతి ప్రజ్వలన తో సభని ప్రారంభించి రాయపాటి సుబ్రహ్మణ్యం గారు స్వాగతోపన్యాసం చేశారు. రఘు దొప్పలపూడి, బాలాజి నాయుడు గుధి, ఉమాపతి, రవి కొత్త లు ఈ సభ లో ప్రసంగించారు. రవి బురుజుల వ్యాఖ్యాత గా వ్యవహరించారు నవ నవ్య ఆంధ్ర ప్రదేశ్ కి తొలి ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎం ఎల్ ఎ లు, ఎం పి లకు, కార్యకర్తలకు, అభిమానులకు, అశేష ఆంధ్ర ప్రజానీకానికి తమ శుభాబినందనలు తెలిపారు. తెదేపా విజయానికి తమ వంతు సహకరించిన జన సేన, బిజెపి పార్టీ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సభలోఅశువులు భాసిన తెదేపా కార్యకర్తలకు, హిమాచల్ ప్రదేశ్ లో ప్రాణాలు కోల్పోఇన విద్యార్ధులకు నివాళులు అర్పించారు. నవ ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి, అభివృధి కి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు శక్తీ వంచన లేకుండా కృషి చేసి ఈ రాష్ట్రాన్ని దేశం లోనే అగ్రగామి గా నిలుపుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆస్టిన్ ఎన్నారై తెదేపా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ కోటపాటి, సదా చిగురుపాటి, సాంబ వెలమ, కృష్ణ ధూళిపాళ్ళ, వీర లెనిన్ తుల్లూరి, లెనిన్ యెర్రం, చందు బొంతు, రంగ గాడిపర్తి, కిరణ్ కొల్లా, శ్రీధర్ పోలవరపు మరియు మోహన్ కనగాల లు కార్యక్రమం లో పాలు పంచుకున్నారు. ఆస్టిన్ ఎన్నారై తెదేపా విభాగం సభకి విచ్చేసిన వారిని రాష్ట్రాభివృద్దికి, రాజధాని నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు, తమ వంతు గా ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి విరాళాలను సేకరిస్తున్నారు.
తెదేపా నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాద రావు గారు, ఆలపాటి రాజ గారు, బోండా ఉమా గారు, ఎన్. శివప్రసాద్ గారు, మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు మరియు లావు అంజయ్య చౌదరి గారు ఫోనులో సంభాషించి ధన్యవాదాలు తెలియచేశారు
వేడుకను విజయవంతం చేసిన వారందరికి ఆస్టిన్ ఎన్నారై తెదేపా విభాగం కృతజ్ఞతలు తెలిపింది